Breaking News

Reliance Future deal : రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌కు ఎదురు దెబ్బ

07 th Aug 2021, UTC

Business News : ఫ్యూచర్ రిటైల్ వివాదం విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఫ్యూచర్‌, రిలయన్స్ రిటైల్‌ గ్రూపుల మధ్య రూ 24,713 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్‌ సవాల్‌ చేస్తూ ఉన్నత  న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై రిలయన్స్‌ ఫ్యూచర్‌  ఒప్పందాన్ని నిలిపేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. "అత్యవసర అవార్డు ఉత్తర్వు సెక్షన్ 17 (1) లోని ఆర్డర్ మరియు మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 17 (2) కింద అమలు చేయవచ్చు" అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీహైకోర్టు సైతం ఇదే చెప్పగా దాని అమలును కోరుతూ అమెజాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే అమెజాన్‌కు అనుకూలంగా న్యాయమూర్తి తాజా తీర్పునిచ్చారు. విదేశంలో ఇచ్చిన ఈఏ భారత చట్ట ప్రకారం వర్తించబోదంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ కోర్టుల్లో వాదిస్తున్నది.

ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ 40 శాతం వాటా కొంది. గతఏడాది అక్టోబర్‌లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ను విలీనం చేసేందుకు రిలయన్స్‌తో రూ.24,731 కోట్ల డీల్‌ను కిషోర్‌ బియాని కుదుర్చుకున్నారు. అమెజాన్‌ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం మొదలుపెట్టింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox