Breaking News

చైనా విమానాలపై అమెరికా నిషేధం..!

04 th Jun 2020, UTC
చైనా విమానాలపై అమెరికా నిషేధం..!

చైనాకు చెందిన ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రర్స్‌ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్, జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ దేశంలో కార్యకలాపాలు సాగించకుండా ట్రంప్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. జూన్‌ 16వ తేదీ నుంచి సదరు సంస్థల విమానాలు అమెరికాలోకి రావడానికి, అమెరికా నుంచి వెళ్లడానికి వీళ్లేదని రవాణా విభాగం స్పష్టం చేసింది.

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో నిలిపివేసిన అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానాలను పునఃప్రారంభించే విషయంలో చైనా విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే మహమ్మారి లీకైందనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్‌ డ్రాగన్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల నేతలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు.  కోవిడ్‌ ధాటికి ఇప్పటికే అమెరికాలో లక్ష మందికి పైగా మృత్యువాత పడ్డారు. 1.87 మిలియన్ల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు నాలుగున్నర లక్షల మంది కోలుకున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox