Breaking News

చైనా ఉత్పత్తి కి గుడ్ బై చెప్పిన శాంసంగ్..!

01 st Aug 2020, UTC

ప్రముఖ  మొబైల్ తయారీ ఉత్పత్తి సంస్థ శాంసంగ్ తన ఉత్పత్తిని చైనా లో నిలిపివేసింది. చైనాలోని తన చివరి కంప్యూటర్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు శాంసంగ్ ఇటీవల ప్రకటించింది. ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ప్రపంచ రెండవ అతి పెద్ద ఆర్థిక దేశమైన చైనా లో తన ఉత్పత్తులను నిలిపివేస్తున్నామని శనివారం తెలిపింది.
         తాజాగా తమ కంపెనీ ని చైనా నుంచి మారుస్తున్నట్లు తెలిపింది. పెరుగుతున్న కార్మిక వ్యయాలు, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్‌-19సంక్షోభం వంటి అంశాలను కంపెనీ ని తరలించడానికి కారణాలు గా పేర్కొంది. ఈ కంపెనీని తరలించడం వల్ల,ఈ ప్రభావం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సుజౌ కంప్యూటర్‌లో కాంట్రాక్టులో ఉన్న 1,700మంది ఉద్యోగుల పై పడనుంది.  పరిశోధన, అభివృద్ధిలో పాల్గొన్న వారిని మినహాయించి మిగిలిన అందరు సిబ్బంది కి కంపెనీ నోటీసు ఇచ్చేసింది.
            చైనాలోని సుజౌ, జియాన్లలో రెండు సెమీకండక్టర్ తయారీ సైట్లు కలిగిన శాంసంగ్ 2012 లో 4.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను రవాణా  చేయగలిగింది. తాజాగా ఇది 2018 వచ్చేసరికి ఒక బిలియన్ కి పడిపోయింది. ఇతర వివరాల గురించి కంపెనీ వెల్లడించలేదు. శాంసంగ్ కు చైనా పెద్ద మార్కెట్ అని,చైనా వినియోగదారులకు సేవలు అందిస్తూనే ఉంటామని కంపెనీ తన ప్రకటన లో తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox