లక్నో :దేశంలోనే అతిపెద్ద
బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు పలు రకాల సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ మహమ్మరి శరవేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో బ్యాంక్ డోర్స్టె్ప్ ఎస్బీఐ ఏటీఎం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకోవలసిన అవసరం లేదు.
ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటి వద్దకే డబ్బులు వచ్చేస్తాయి. బ్యాంకు జనరల్ మేనేజర్(లక్నో సర్కిల్) అజయ్ కుమార్ తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారాఈ కొత్త సర్వీసుల గురించి వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఈ సేవలు లక్నోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయిఇక్కడ విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే ఈ కొత్త సేవల వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్‌కు సౌకర్యంగా వుండే అవకాశముంది. స్టేట్ బ్యాంక్ ఇటీవల కస్టమ్లకు మినిమమ్ బ్యాలెన్స్, ఎస్ఎంఎస్ చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు చదవండి.