Breaking News

ఒక్క ట్వీట్ తో ఎలాన్ మస్క్ కు 1.10 లక్షల కోట్ల నష్టం..!

23 rd Feb 2021, UTC

ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కు భారీగా నష్టం వాటిల్లింది. ఆయన చేసిన ట్వీట్ల వల్లనే ఆయనకు ఈ నష్టం సంభవించింది. ఆయనకు ఇలా ట్వీట్ల వలన నష్టాల బారిన పడడం కొత్తేమి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వలన నష్టాలని కొని తెచ్చుకున్నారు. తాజాగా, ఆయన చేసిన మరో వివాదాస్పద ట్వీట్ వలన టెస్లా ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతానికి తగ్గిపోయింది. దీనితో మస్క్ ఆస్తి విలువలో రూ. 1.10 లక్షల కోట్లు (సుమారు 15.2 బిలియన్ డాలర్లు) తగ్గింది.

ఇటీవల ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ల వ్యాపారంలోకి దిగారు. ప్రస్తుతం బిట్ కాయిన్ల ధర పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 50 వేల డాలర్లకు చేరింది. ఈ క్రమంలో స్పందించిన ఎలాన్ మస్క్  "బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోంది" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో టెస్లా ఈక్విటీ వాటాలను అమ్మడానికి ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో ముందుకు వచ్చారు.  దీనితో సంస్థ ఈక్విటీ విలువ బాగా పడిపోయింది. మరో వైపు బిట్ కాయిన్ల సేవలను ప్రారంభించాలన్న ఉద్దేశ్యంలో ఉన్న ఎలాన్ మస్క్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బిట్ కాయిన్లను కూడా కొనుగోలు చేసారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox