Breaking News

నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

26 th May 2022, UTC

Amaravati: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలపై వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ వైసీపీ అభ్యర్థులుగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం జగన్ ఎంపిక చేశారు. దీనితో వారు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిజటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఏపీలో ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటిని జూన్ 1న ఉదయం 11 గంటలకు పరిశీలిస్తారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే జూన్ 10న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox