Breaking News

YS Vivekananda reddy murder case: ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శంకర్ రెడ్డిని విచారించిన సీబీఐ

13 th Aug 2021, UTC

Andhra pradesh:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు  డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు విచారించారు. ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. 

నా కుటుంబానికి భద్రత కల్పించాలి.. వైఎస్ సునీత

మరోవైపు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు.

శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox