Breaking News

యు ట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్... మందు తాగి..!

27 th Feb 2021, UTC

ప్రముఖ యూట్యూబ్ స్టార్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ మద్యం తాగి తన వాహనాన్ని నడిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం తో బండి అదుపు తప్పి మరో మూడు వాహనాలను ఢీకొట్టింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ ఘటన చోటు చేసుకుంది. షణ్ముఖ్ జస్వంత్ మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్లనే ఈ ఆక్సిడెంట్ జరిగినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

ఈ ఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ మద్యం ప్రభావంతో వాహనాన్ని నడిపాడని స్థానికులు ఆరోపించారు. బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయగా, 170 రీడింగ్ చూపించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, షణ్ముఖ్ జస్వంత్ ను కస్టడీ లోనికి తీసుకున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox