Breaking News

నేటి నుంచి జూలై 1 వరకు వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3 ..!

10 th Jun 2020, UTC

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా నేటి నుంచి   వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3  కార్యక్రమం కొనసాగనుంది.  43 దేశాల నుంచి 60వేల మంది ప్రయాణికుల తరలింపునకు భారత విమానయానశాఖ ఏర్పాట్లు చేసింది.

ఎయిరిండియా వివిధ దేశాల నుంచి ప్రయాణికులను తీసుకురావడానికి 300 విమానాలు నడపనుంది. కాగా.. కరోనా ప్రభావంతో యూరప్‌, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే, ఆఫ్రికా దేశాల నుంచి అనేక మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు.

కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు అదనంగా మరో 58 విమానాలను నడుపుతున్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. జూన్ 30 వరకూ ఈ 58 అదనపు విమానాలు గల్ఫ్ దేశాలకు వెళ్తాయని చెప్పారు

. వందే భారత్ మిషన్ మూడో దశ (ఫేజ్-3) కింద తొలుత 107 విమానాలను నడపాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు 165కి పెంచినట్టు తెలిపారు. వందేభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకూ సుమారు 70,000 మందిని విదేశాల నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. ఈ మిషన్ మూడో దశ జూన్ 11న ప్రారంభమై జూన్ 30 వరకూ కొనసాగుతుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox