Breaking News

సెంచరీ దాటిన టమాటా ధర భారీ వర్షాలు , వరదలే కారణం..

24 th Nov 2021, UTC

టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 2 నెలల క్రితం కేజీ 10 రూపాయలుగా ఉన్న టమాటో ధర...ఇప్పుడు ఏకంగా 100 రూపాయలు దాటింది. ఒకప్పుడు ఉల్లి ధర వినియోగదారులను హడలెత్తించగా ...తాజాగా టమాటో ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనే పరిస్థితి లేక తలపట్టుకుంటున్నారు.    చిత్తూరు జిల్లా మదనపల్లెలో కిలో టమోటో ధర 130 రూపాయలకు చేరింది. అటు చెన్నైలో కిలో టమాటో ధర 160 రూపాయలకు చేరింది. వర్షాలు, వరదల కారణంగా దిగుబడి సరిగా రాకపోవటంతో తీవ్రమైన టమాటో కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా టమాటోలకు ఇబ్బంది ఉంది. టమాటోలకు అతిపెద్ద మార్కెట్ అయిన కోలార్ లో కూడా టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. 15 కిలోల టమాటాల బాక్స్ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది.

కూరగాయలలోనే అత్యధిక వినియోగం ఉండే టమాటో ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వరదలు కూడా టమాట ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని టమాటోలకు ఫేమస్ అయిన మదనపల్లి నుండి అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయల మార్కెట్ కు టమాటో సరఫరా అవుతుంది. అయితే చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కారణంగా ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా మదనపల్లె డివిజన్‌ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచి ఉండడం, వర్షం దెబ్బకు పంట నాణ్యత కోల్పోవడం, డ్యామేజీ అధికంగా ఉండడం వంటి కారణాలతో సరుకు లభ్యత కష్టమవుతోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లోనూ ధరలు అకస్మాత్తుగా పెరిగాయి.

ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2 లక్షల 27 వేల టన్నుల టమాటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. అయితే.. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొంటున్నారు. దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. దీంతో మార్కెట్‌లో టామోట డిమాండ్ మరింత పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

.................

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox