Breaking News

26 /11 .. మరోసారి ముష్కరుల యత్నం.. మోడీ అత్యవసర సమావేశం!

20 th Nov 2020, UTC

న్యూఢిల్లీ :26 /11, ఈ తేదీని అంత తొందరగా మరచిపోలేము. 2008, 26 /11న ముంబైలో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఘటనతో భారత్ మొత్తం బెదిరిపోయింది. తాజాగా, ఈ ఏడాది అదే రోజు న (26 /11 న) ముష్కరులు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉగ్రదాడికి పాల్పడడానికి స్కెచ్ వేస్తున్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరిలో నలుగురు టెర్రరిస్టులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ నలుగురు  ముంబై దాడులు జరిగిన రోజే మరోసారి భారీ స్థాయిలో దాడి చేయడానికి సన్నాహాలు పన్నుతున్నారని స్పష్టం అయింది. 

ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ దేశ భద్రతా విషయమై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ వర్గాల అధినేతలతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత భద్రతా బలగాలను ప్రధాని మోడీ అభినందించారు. 

జమ్మూ కాశ్మిర్ లోని భద్రతా బలగాలు జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసాయి. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలో ఓ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ ట్రక్కుని తనిఖీ చేయడానికి పోలీస్ లు ప్రయత్నించారు. దీనితో ట్రక్కు డ్రైవర్ వెంటనే దిగి పారిపోయాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ట్రక్కుని తనిఖీ చేసారు. బియ్యం బస్తాల వెనక, ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారు. వారు భద్రతా బలగాలను చూడగానే,  గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీనితో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు వారిని చుట్టుముట్టి , కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు హతమయ్యారు. ఇద్దరు పోలీస్ లు గాయపడ్డారు. కాగా, ఉగ్రవాదుల నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox