Breaking News

ముంబై తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు..!

30 th Jun 2020, UTC
ముంబై తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు..!
              ముంబై లోని తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి 12.30 గంట‌ల‌కు హోటల్ లో బాంబు ఉందని బెదిరింపు ఫోన్ కాల్ రావడం స్థానికం గా కలకలం సృష్టించింది. బాంబులతో హోటల్ ని పేల్చివేస్తామని ఒ గుర్తు తెలియని ఆగంతకుడు బెదిరించాడని ముంబై పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాల్ వచ్చిన వెంటనే.. పోలీసులు అలెర్ట్ అయ్యారు.. వెంటనే హోటల్ చుట్టూ.. భారీ గా బందోబస్తు ని సిద్ధం చేసారు.. డాగ్ స్క్వాడ్ ను కూడా సిద్ధం చేసుకున్నారు.
 
              అయితే.. ఈ ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చిందో.. ట్రేస్ చేయగా పాకిస్థాన్ లోని కరాచీ నుంచి వచ్చిందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. నిన్న క‌రాచీలో స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై టెర్ర‌ర్ అటాక్ జ‌ర‌గ్గా..న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చిన సంగతి తెలుస్తోంది. ఈ నేపధ్యం లో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం తో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
 
              గతం లోను ఈ హోటల్ పై ఉగ్రదాడులు జరిగాయి. 2008లో తాజ్‌హోట‌ల్‌పై ఉగ్ర‌వాదులు దాడి జరిపిన ఘటన లో 166 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 300 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. పాక్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదులు ఆ దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. దీనితో.. మరో సారి బెదిరింపు కాల్ రావడం తో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox