Breaking News

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూత

09 th Jan 2022, UTC

సూపర్‌ స్టార్‌ కృష్ణ  పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  

రమేశ్‌బాబు. తండ్రి çకృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా వెండితెరపై తొలిసారిగా కనిపించారు. చేశారు. ఆ తర్వాత కృష్ణనిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. ‘దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్‌’వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’లో తొలిసారిగా టీనేజ్‌ ప్రధాన పాత్ర చేశారు.వి.మధుసూదనరావుదర్శకత్వంలో‘సామ్రాట్‌’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్‌ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.  1997లో ఎన్‌. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఎన్‌కౌంటర్‌’రమేశ్‌బాబుకి చివరి చిత్రం. రమేష్ బాబు హిందీ సూర్యవంశం, అతిధి, అర్జున్, దూకుడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. రమేశ్‌కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. రమేశ్‌ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox