Breaking News

రఘురామకృష్ణంరాజుకు షాక్..  స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగింపు

17 th Oct 2020, UTC

న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం ఎంపీగా ఎన్నికై  పార్టీ నేతలపై విరామం లేకుండా విమర్షలు చేస్తున్న రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామ కృష్ణరాజును తప్పిస్తూ లోక్‌సభ స్పీకర్ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వైసీపీకే చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు.అక్టోబర్ 9వ తేదీ నుంచే ఈ మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం వెల్లడించింది. 

ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొద్దికాలంగా పార్టీ పై విమర్షలు చేస్తుండటంతో పార్టీకి చెందిన పార్లమెంట్ సబ్యులు అందరూ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి  రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసారు. అయితే తన పదవికి ఎటువంటి ఢోకా లేదని తనను సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కూడ తొలగించలేరని రఘురామకృష్ణరాజు చెబుతూ వస్తున్నారు. కొన్ని రోజుల కిందట సీబీఐ ఆయన కంపెనీల్లో సోదాలు నిర్వహించడం, తాజాగా ఆయనను స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవినుంచి తప్పించడం చూస్తుంటే ఆయనకు ఢిల్లీలో పరిస్దితులు వ్యతిరేకంగానే వున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox