Breaking News

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

20 th Jul 2021, UTC

బాలీవుడ్ :అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసు పై నటుడు శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కుంద్రాను సోమవారం అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. రాజ్ కుంద్రా పాత్రపై తగిన సాక్ష్యాలు  వున్నాయని చెప్పిన పోలీసులు కేసు దర్యాప్తులో వుందన్నారు.

అశ్లీల చిత్రాలను రూపొందించడం మరియు కొన్ని యాప్ ల ద్వారా ప్రచురించడం గురించి ఫిబ్రవరి 2021 లో ముంబైలో క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మిస్టర్ రాజ్ కుంద్రాను సోమవారం అరెస్టు చేసాము. దీనికి సంబంధించి మాకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ముంబై పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదన్న రాజ్ కుంద్రా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరారు. శిల్పా శెట్టి 2009 లో రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు వారికి 2012 లో మొదటి బిడ్డ జన్మించారు.ఈ జంట గత సంవత్సరం సర్రోగసీ ద్వారా ఒక కుమార్తెను పొందారు. భారత క్రికెట్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి 2013 లో ఢిల్లీ పోలీసులు రాజ్ కుంద్రాను ప్రశ్నించారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox