Breaking News

పెగాసస్ వ్యవహారం పై పార్లమెంటరీ కమిటీ నజర్

21 st Jul 2021, UTC

కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ శశీథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ‘పెగాసస్’ వ్యవహారంపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. పెగాసస్ స్పైవేర్ నిఘా నీడలో వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ. ఐటీ, హోం శాఖలను ప్రశ్నించేందుకు సిద్ధమైంది.  పౌరుల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చిస్తామంటూ  కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇజ్రాయలీ నిఘా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన పెగాసస్ సాఫ్ట్‌వేర్. దేశంలోని పలువురు ప్రముఖులపై నిఘా పెట్టేందుకు వినియోగించారన్న వార్తల నేపధ్యంలో ప్రతిపక్షాలు కేంద్రం పై మండిపడుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, 40 మంది ప్రముఖ జర్నలిస్టులపై పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెట్టిందన్న అనుమానం వ్యక్తం చేస్తూ ది వైర్, వాషింగ్టన్ పోస్ట్ వంటి 14 వార్తా సంస్థలు ఇటీవల సంచలన కథనాలు ప్రచురించాయి. ప్రముఖల ఫోన్ నెంబర్లు ఉన్న జాబితాను ప్రకటించాయి. 

ఈ స్పైవేర్ మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించి కీలక సమాచారాన్ని చాలా పకడ్బందీ వ్యూహంతో తస్కరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox