Breaking News

ఈ ఏడాది పాఠశాలలు తెరుద్దామా? వద్దా?

29 th Jul 2020, UTC
ఈ ఏడాది పాఠశాలలు తెరుద్దామా? వద్దా?
 
కరోనా మహమ్మారి కారణం గా పాఠశాలలు మూత పడ్డ సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి భారత్ లో ప్రవేశించినప్పటి నుంచే.. మార్చి నుంచే పాఠశాలలు మూసివేశారు.. అయితే.. కరోనా ఉద్ధృతి తగ్గకపోవడం తో పరీక్షలు కూడా రద్దు చేసారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు అయ్యాయి.. గ్రాడ్యుయేషన్ ఫైనల్ సంవత్సరం పరీక్షలు మినహా మిగతా పరీక్షలు రద్దు అయ్యాయి.. ప్రస్తుతం.. 2020-21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాల్సి ఉంది.. 
         ఈ నేపధ్యం లో పాఠశాలలు తిరిగి తెరవాలా వద్దా అన్న సందేహం నెలకొంటోంది.. ఈ తరుణం లో కేంద్రం తల్లి తండ్రుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించింది.. కేంద్రం ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అభిప్రాయాలు కోరుతూ విద్యాశాఖ సర్వే నిర్వహించనుంది.  కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. 
           ఒక రోజులో అభిప్రాయాలు సేకరించి అందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈనెల 19న కోరింది. అయితే..ఇందుకోసం  జూలై ఆఖరు వరకు సమయం కావాలంటూ రాష్ట్రం తెలిపింది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆన్‌లైన్‌ ఫార్మాట్‌ అందించింది.  పాఠశాలలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఎప్పుడు ప్రారంభించాలి.. లేదా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరవకూడదా..? ..  పాఠశాలలు ప్రారంభిస్తే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తున్నారు..?..  పాఠశాల ప్రారంభిస్తే ఎలా నడపాలి..? ..  అన్న మూడు ప్రశ్నలు సర్వేలో భాగంగా అడుగుతున్నారు.వీటికి తల్లితండ్రులు చెప్పిన సమాధానాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox