Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని రౌత్ తెలిపారు. 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే కూటమి నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రెబల్స్‌లో 21 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.
మరోవైపు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బలప్రదర్శన చేశారు. ఈ మేరకు గౌహతి నుంచి వీడియో విడుదల చేశారు. ఒకే వేదికపై 42 మంది ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే బలప్రదర్శన చేశారు. వారిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు ఠాక్రేతో భేటీకి 13 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని హోటల్ లో క్యాంపు వేశారు.
తాజాగా ఈ హోటల్ కు అసోం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకుని, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి ముందు భారీ ఆఫర్ ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. ఒకవేళ శివసేన ఎంపీలు వస్తే కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్టు సమాచారం.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022