Breaking News

PM narendra Modi: సైనిక్ స్కూళ్లో బాలికలకు ప్రవేశాలు.. ప్రధాని మోదీ

15 th Aug 2021, UTC

NEW DELHI:దేశంలో బాలికల కోసం మరిన్ని సైనిక్ స్కూళ్లు తెరవబడుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితం మిజోరాంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ తరువాత  బాలురకు మాత్రమే పరిమితమయిన సైనిక్ పాఠశాలలు బాలికలు కూడ చేరడానికి అవకాశం వచ్చింది.

నాకు లక్షల మంది బాలికల నుండి సైనిక్ స్కూల్‌లో కూడా చదువుకోవాలనుకుంటున్నట్లు మెసేజ్‌లు వచ్చేవి. సైనిక్ స్కూల్స్ తలుపులు వారికి కూడా తెరవాలి" అని  పీఎం మోదీ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం, మిజోరాంలోని సైనిక్ పాఠశాలలో మొదటిసారిగా బాలికలను చేర్చుకునే ప్రయోగం జరిగింది. ఇప్పుడు దేశంలోని అన్ని సైనిక్ పాఠశాలలు వారి కోసం తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మోదీ అన్నారు. విద్య లేదా క్రీడలు, బోర్డ్ ఫలితాలు లేదా ఒలింపిక్స్ పతకాలు వేటిలోనయినా బాలికలు ఈ రోజు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు.

దేశంలో 33 సైనిక్ పాఠశాలలు పనిచేస్తున్నాయి.సైనిక్ స్కూళ్లను సైనిక్ స్కూల్స్ సొసైటీ నిర్వహిస్తుంది, ఇది రక్షణ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంది. చిన్న వయస్సు నుండే విద్యార్థులను సాయుధ దళాలలో ప్రవేశించడానికి సిద్ధం చేయడం లక్ష్యంగా వీటిని నెలకొల్పారు. మరిన్ని వార్తలు చదవండి 

.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox