Breaking News

అక్కడ నైట్ కర్ఫ్యూ.. పోలిసుల గస్తీ..!

20 th Nov 2020, UTC
అక్కడ నైట్ కర్ఫ్యూ.. పోలిసుల గస్తీ..!

కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయని పలు రాష్ట్రాలు చెప్పుకుంటున్న, స్థూలంగా చూస్తే మాత్రం చాలా చోట్ల కేసులు హెచ్చుస్థాయిలో నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల సెకండ్ వేవ్ వచ్చిందేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే, దేశ రాజధాని ఢిల్లీలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా, అహ్మదాబాద్, గాంధీ నగర్ పరిధిలో నైట్ కర్ఫ్యూని అమలు చేయనున్నారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. 
    
శుక్రవారం నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలు లో ఉంటుందని, ప్రజలను బయటకు రావద్దని ఇప్పటికే అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  ఆదేశాలను విడుదల చేసింది. ఇప్పటి వరకు నగరం లో  46,022 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల పండగ సీజన్ ముగిసిన నేపధ్యంలో, ఈ కేసుల సంఖ్యా మరింత ఎక్కువగా ఉంది. ఈ కేసులు మరింత పెరగకుండా ఉండడం కోసం నైట్ కర్ఫ్యూని విధించారు. పలు ఆసుపత్రుల్లో 40 శాతం బెడ్లు ఖాళీగానే ఉన్నాయని, అయితే, కేసుల సంఖ్యా మరింత పెరగకుండ ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అదనపు చీఫ్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ గుప్తా  తెలిపారు.

మరో వైపు, నగరంలో మైక్రో కంటెయిన్ మెంట్ ఏరియాల సంఖ్య కూడా వంద దాటింది. వీటిలో రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు అపార్ట్మెంట్ లు కూడా ఉన్నాయి. అయితే, కేసుల సంఖ్యా ఎక్కువ గా ఉన్న ప్రాంతాలలో మాత్రం  నైట్ కర్ఫ్యూ విధించి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీ లో కూడా కరోనా ఉద్ధృతి పెరుగుతున్న సమయంలో, లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేసినా సంగతి తెలిసిందే. ఆంక్షలు మాత్రమే విధిస్తున్నామని స్పష్టం చేసారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox