Breaking News

వర్మ కొత్త సినిమా పవర్ స్టార్

28 th Jun 2020, UTC
వర్మ కొత్త సినిమా పవర్ స్టార్

సంచలన దర్శకుడు  రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘పవర్‌ స్టార్‌’ సినిమా చేయనున్నట్లు  ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.  బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం.

పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా వర్మ  ‘పవర్‌ స్టార్‌’లో పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను  విడుదల చేశారు. ‘నా కొత్త సినిమా ‘పవర్‌ స్టార్‌’లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం.

ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం’’ అంటూ తన దైన శైలిలో రాసుకొచ్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox