Breaking News

రెమెడిసివర్‌ డ్రగ్ తో ప్రయోజనం లేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)

16 th Oct 2020, UTC

జెనివా :ప్రస్తుతం కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వాడుతున్న రెమెడిసివర్‌ ఔషధంతో అసలు ఎలాంటి ప్రభావం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తెలిపింది. రెమెడిసివర్‌ తీసుకున్న రోగులు కోలుకోవడం లేదా వారి జీవితకాలం పెరగడం వంటి ఫలితాలు కనిపించలేదని డబ్ల్యూహెచ్‌ఓ సర్వే తెలిపింది. కరోనా వైరస్‌ చికిత్స కోసం ఉపయోగించిన మొట్ట మొదటి యాంటీవైరల్‌ మందు రెమెడిసివర్‌. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చికిత్సలో భాగంగా దీన్ని కూడా ఉపయోగించారు.

ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాలలో కోవిడ్‌ రోగుల మీద రెమెడిసివర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, యాంటీ-హెచ్‌ఐవీ డ్రగ్‌ లోపినావిర్‌/రిటోనావిర్‌, కాంబినేషన్లను ఉపయోగిస్తున్నారు. దీనితో డబ్ల్యూహెచ్‌ఓ వీటి ప్రభావాలను అంచనా వేయడానికి సాలిడారిటీ ట్రయల్‌ నిర్వహించింది. దీనిలో రెమెడిసివర్‌తో సహా మిగిలిన ఔషధాలు కోవిడ్‌ రోగులకు ఇచ్చే 28 రోజుల కోర్సులో అతి తక్కువ ప్రభావం లేదా అసలు ఎలాంటి ప్రభావం చూపలేదని అధ్యాయనం వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో అమెరికా గిలియడ్,‌ రెమెడిసివర్‌పై చేసిన ప్రయోగాల్లో ప్లాసిబో తీసుకునే వారితో పోల్చితే ఈ ఔషధం తీసుకున్న కోవిడ్‌ రోగుల్లోవారు కోలుకునే సమయం ఐదు రోజులకు తగ్గినట్లు  తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox