Breaking News

బాలాపూర్ గణేష్ లడ్డు కు రికార్డు ధర

19 th Sep 2021, UTC
  బాలాపూర్ గణేష్ లడ్డు కు రికార్డు ధర

 బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ముగిసింది.   ఈ ఏడాది   లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. 2019లో జరిగిన వేలంలో రూ.17లక్షలా 60వేలు పలికింది. కరోనా కారణంగా గత ఏడాది వేలం పాటను రద్దు చేసిన విషయం తెలిసిందే.

రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశ్యంతో తాను ఈ వేలం పాటలో పాల్గొని లడ్డును దక్కించుకొన్నట్టుగా రమేష్ యాదవ్ చెప్పారు. ఈ లడ్డును ఏపీ సీఎం జగన్ కు తాను బహుమతిగా అందిస్తానని ఆయన చెప్పారు. తన సోదరుడు శశాంక్ రెడ్డితో కలిపి ఈ లడ్డును దక్కించుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలం పాటలో పాల్గొనేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని మర్రి శశాంక్ రెడ్డి చెప్పారు.  ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకొంటున్నట్టుగా శశాంక్ రెడ్డి తెలిపారు. గతంలో లడ్డును దక్కించుకొన్న వారి కంటే కొత్తవారికి  వేలం పాటలో పాల్గొనేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox