Breaking News

వెబ్ సిరీస్ అవకాశాలపేరుతో మహిళలకు ఎర, బయటపడిన రాజ్ కుంద్రా వాట్సాప్ చాట్

21 st Jul 2021, UTC

ముంబై :నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్నోగ్రపీ కేసులో ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్ కుంద్రా వాట్సాప్ సంబాషణలు వెలుగుచూసాయి. వీటిలో అశ్లీల చిత్రాల ద్వారా ఆయన సంపాదించిన మొత్తం వివరాలు కూడ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసిన 11 మందిలో శిల్పా భర్త కీలక కుట్రదారుడని సమాచారంవెబ్ సిరీస్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ  రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల్లో నటించమని మహిళలను వత్తిడి చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే పేర్కొన్నారు. రాజ్ కుంద్రా యూకేలో నివసిస్తున్న ప్రదీప్ బక్షి బంధువు. అతను కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ అనే సంస్థను కూడా నడుపుతున్నాడు. అతను కుంద్రా వ్యాపార భాగస్వామి. ఇప్పుడు బక్షి మరియు కుంద్రా మధ్య వాట్సాప్ చాట్లు లీక్ అయ్యాయి. వీటిలో అశ్లీల కంటెంట్‌ ద్వారా సంపాదించిన డబ్బు  వివరాలు కూడ బయటకు వచ్చాయి. వీరి వాట్సాప్ సంభాషణలో ఇతరుల పేర్లు బయటకు వచ్చాయి.

రాజ్ కుంద్రా మాజీ వ్యక్తిగత సహాయకుడు ఉమేష్ కామత్ భారతదేశంలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారు. ఈ సంస్థ అశ్లీల చిత్రాల కోసం ఏజెంట్లతో అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ  చిత్రాలకు నిధులను అందజేసింది.  వివాదాస్పద మోడల్ నటి గెహ్నా వశిష్ట్ కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన  అనేక పోర్న్ చిత్రాలలో నటించారు. ఈ రకమైన చిత్రాల నిర్మాణానికి సంస్థ నటీనటులకు ముందస్తు చెల్లింపులను కూడా చేసింది.

ముందస్తు చెల్లింపులు అందుకున్న తరువాత ఉమేష్ కామత్  ఈ చిత్రాలకు కంటెంట్‌ ను తయారు చేసి, కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్‌తో ఇమెయిల్‌ల ద్వారా షేర్ చేసుకున్నారు. మిగిలిన చెల్లింపులు ఆయా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి. సోషల్ మీడియా యాప్ హాట్‌షాట్‌లో ఈ చిత్రాల కంటెంట్ ప్రచురించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ దేశంలోని వివిధ ఏజెంట్ల ద్వారా అశ్లీల చిత్రాలకు మరియు అలాంటి కంటెంట్‌కు నిధులు సమకూర్చుతోందని తెలిసింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox