Breaking News

రాష్ట్రము లో మూడు రోజుల పాటు వర్షం..?

29 th Jun 2020, UTC
రాష్ట్రము లో మూడు రోజుల పాటు వర్షం..?
తెలంగాణ లో వరుస పెట్టి మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది. ఓ మోస్తరు నుంచి భారీ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ సూచనలు చేసింది. దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీట‌ర్ల నుంచి 3.6 కిలోమీట‌ర్ల‌ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే మ‌రాఠ్వాడా, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం కొన‌సాగుతోంద‌ని ఈ శాఖ చెప్పుకొచ్చింది. ఈ ఆవర్తనాలు  కారణం గా రాష్ట్రము లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అక్కడకక్కడ.. ఉరుములు.. మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ గ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox