Breaking News

ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.... రాహుల్ గాంధీ

15 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :వలస కార్మికుల మరణాలకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదంటూ పార్లమెంటులో కేంద్రం సోమవారం నాడు ప్రకటించడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్విటర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. లాక్ డౌన్‌లో ఎంత మంది వలస కార్మికులు చనిపోయారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారో మోదీ ప్రభుత్వానికి తెలీదు. మీరు లెక్కపెట్టకపోతే, ఎవరూ చనిపోనట్టా? విచారకరమైన విషయం ఏంటంటే, ప్రాణాలు పోతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రపంచం మొత్తం చూసినా సరే, మోదీ ప్రభుత్వానికి మాత్రం తెలీలేదు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున వలస కూలీల మరణాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద సమాచారం లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox