Breaking News

పుదుచ్చేరి సీఎం రాజీనామా.. కుప్పకూలిన కాంగ్రెస్..!

22 nd Feb 2021, UTC

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణ చేయాల్సింది గా డిప్యూటీ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందర్య రాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ లో కొద్దీ సేపటి క్రితం అసెంబ్లీలో బల పరీక్ష జరిగింది. ఈ బల నిరూపణలో వి. నారాయణ స్వామి ఓటమిపాలయ్యారు. దీనితో, గత నాలుగున్నరేళ్ల గా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినట్లయింది.

బల నిరూపణలో ఓటమి పాలయినట్లు తెలియగానే, నారాయణ స్వామి  రాజీనామా లేఖను తీసుకుని రాజ్ భవన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పుదుచ్చేరిలో తాత్కాలిక గవర్నర్ గా అదనపు బాధ్యతను నిర్వరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళిసై పుదుచ్చేరి రాజ్ భవన్ వద్దే ఉంటున్నారు. మరికాసేపట్లో నారాయణ స్వామి తమిళిసై సౌందర్య రాజన్ కు తన రాజీనామా లేఖను అందించనున్నారు.

అయితే గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ న్యాయనిపుణుల ను సంప్రదించి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ రాజీనామా ఆమోదం పొందితే, పుదుచ్చేరి లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox