Breaking News

వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు

08 th Jan 2022, UTC
వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు

పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీసులో వనమా రాఘవను పోలీసులు విచారించారు. పలు పాత కేసులకు సంబంధించి రాఘవపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అతడికి సహకరించిన మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవ కారును సీజ్ చేశారు. కాసేపట్లో వనమా రాఘవకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

విశాఖలో రెండు రోజుల పాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.... పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి జిల్లా అదనపు ఎస్పీ ప్రసాద్‌రావ్‌ ఆధ్వర్యంలో రాఘవను అదుపులోకి తీసుకుని పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. అతడితో పాటు పాల్వంచ మండలానికి చెందిన ముక్తేవి గిరీశ్‌, మరొకరిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వారిని పాల్వంచ తీసుకొచ్చారు. పోలీసులు రాఘవ సహా మిగిలిన ఇద్దరినీ విచారించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox