Breaking News

రూ.75 నాణాన్ని విడుదల చేసిన ప్రధాని..!

16 th Oct 2020, UTC
రూ.75 నాణాన్ని విడుదల చేసిన ప్రధాని..!

న్యూఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 నాణేన్ని విడుదల చేశారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 స్మారక నాణేన్ని  విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కాగా ఈ సందర్భంగా  ప్రభుత్వం అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను  ప్రధాని ఆవిష్కరించారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలో ఉన్న పాత రికార్డులన్నీ చెరిగిపోయాయని రైతులకు కనీస మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

దేశ ఆహార భద్రతకు రైతులను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. సరైన వసతులు లేకపోవడంతో ఆహారాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతోందన్నారు. అయితే ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులకు మరింత లబ్ది చేకూరుతుందని ప్రధాని మోదీ అన్నారు.

ఈఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడాన్ని కూడా ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్ కూడా ఇందులో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు.. మరో వైపు పెళ్లి వయసు ఎంత ఉండాలన్న విషయమై కూడా తనకు లేఖలు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ అంశం పై ఇప్పటికే కమిటీ మెంబర్లు చర్చిస్తున్నారని, చర్చలు పూర్తి అయ్యాక ఏకాభిప్రాయం కుదిరాక తొందరలోనే ఈ మేరకు నూతన చట్టాన్ని కూడా తీసుకొస్తామన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox