Breaking News

టీచర్ల ఫొటోలు మార్ఫింగ్..!

27 th Jun 2020, UTC
టీచర్ల ఫొటోలు మార్ఫింగ్..!
రాను  రాను యువత ఎటు పోతోందో అర్ధం కావడం లేదు. గురువు అన్న పదానికి నేడు ఎవరు సరైన నిర్వచనం చెప్పలేరు.. విద్యార్థులలో కూడా చాల మార్పులు వచ్చాయి.. గతం లోలా.. గురువుల పట్ల గౌరవం గా ఉండడం లేదు.. అసభ్యం గా మాట్లాడటం.. నిర్లక్ష్యం గా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. టీచర్ల గురించి చెడు గా మాట్లాడుకోవోడం.. హేళన చేయడం వంటివి ఈరోజు ఎక్కువవుతున్నాయి.. తల్లితండ్రుల అమిత గారాబం.. సోషల్ మీడియా చేతిలో ఉండడం.. అంతర్జాలం లో అర్ధం లేనివాణ్ణి చూడడం వెరసి విద్యార్థులను ఇలా తయారు చేస్తున్నాయి.. సినిమాలలో కూడా టీచర్ లను కామెడియన్లుగా చూపించడం కూడా ఓ కారణం కావచ్చు.. ఆ ప్రభావం పిల్లలపైనా పడుతోంది..
 
              అయితే.. కొందరు ఆకతాయి పిల్లలు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నపుడు  స్క్రీంషాట్ లు తీసి.. వాటిని మార్ఫింగ్ చేసి అవమానకర రాతలు జత చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇవి చుసిన స్కూల్ యాజమాన్యం ఖంగు తింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్పీ పంకజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. "ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్న టీచర్ల ఫొటోలను స్క్రీన్‌ షాట్లు కొట్టి వాటిని మార్ఫింగ్‌ చేసి తిడుతూ సోషల్‌ మీడియాలో పెట్టారు. స్కూల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని" చెప్పారు. 
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox