Breaking News

అర్థరాత్రి అరెస్టులతో అడ్డుకోలేరు.. పవన్ కళ్యాణ్

21 st Jul 2021, UTC

నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడే గొంతు నొక్కాలనుకొంటున్నారా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ ను ప్రశ్నించారు. అర్థరాత్రి అరెస్టులతో, నిర్బంధాలతో జనసేన నాయకులను, శ్రేణులను నిలువరించలేరన్నారు. ఎంతగా కట్టడి చేయాలని చూసినా నిరుద్యోగుల కోసం వినతి పత్రాలు అందించగలిగారని చెప్పారు.

రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను జగన్ రెడ్డి మోసం‌ చేశాడని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం మాట నిలబెట్టుకోవాలన్నారు.

ప్రభుత్వం చేసిన వంచనపై జనసేన ప్రశ్నించి  ఆ యువతకు అండగా నిలిచాం. అక్రమంగా అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం.జనసేనకు మాత్రమే నిబంధనలూ, నిర్బంధాలా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox