Breaking News

పాక్ ఆరోగ్యశాఖ మంత్రి కి కరోనా..!

06 th Jul 2020, UTC
పాక్ ఆరోగ్యశాఖ మంత్రి కి కరోనా..!
కరోనా మహమ్మారి అన్ని దేశాల్లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.. సామాన్యుల నుంచి పాలకుల వరకు.. అందరిని కరోనా ముట్టడిస్తోంది. మరో వైపు.. దాయాది దేశం.. శత్రు దేశం.. పాకిస్థాన్ లో కూడా కరోనా తీవ్రత హెచ్చు గా ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా..  ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జాఫర్ మీర్జాకు కూడా కరోనా సోకింది.. ఈ విషయాన్నీ ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయనకు కరోనా పరీక్షా చేసిన తర్వాత పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు. మంత్రిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. తనకు కరోనా సోకిందని చెప్పిన ఆరోగ్య శాఖా మంత్రి వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధం లో ఉంటున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నానని పేర్కొన్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox