Breaking News

రిటైర్మెంట్ తీసుకోబోతున్న తరుణం లో కరోనా కాటుకి బలి..!

26 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి  ఎందరో జీవితాలను బలిగొంటోంది. ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడే వైద్యుల పరిస్థితి మరీ ఇబ్బంది కరం గా ఉంది. ఎటువైపు చుసిన కరోనా నే ఉంటుంది.. పీపీఈ కిట్ లను ధరించి గంటల తరబడి విధులు నిర్వర్తించడం అంటే మాములు విషయం కాదు. తాజాగా.. హైదరాబాదు కు చెందిన ఓ నర్సు కరోనా కాటు కు బలి అయింది. కరోనా సోకి.. చికిత్స తీసుకుంటూ ఆమె మృతి చెందింది. 
 
                   వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు.. వీరిలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు.. మరికొందరు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎన్నో ఏళ్ళు గా సేవలందించి.. హెడ్ నర్సు గా ప్రమోషన్ కూడా పొంది.. నాలుగు రోజుల్లో రిటైర్ అవ్వబోతున్న ఓ నర్సు కరోనా బారిన పడింది.. హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో హెడ్‌ నర్సుగా సేవలందించిన విక్టోరియా జయమణి తాజాగా కరోనా తో మృతి చెందారు. 20 రోజుల ముందు వరకు ఆమె కరోనా చికిత్స లో భాగం అయ్యారు. వైరస్ బారిన పడిన తరువాత ఆమె కూడా చికిత్సను పొందుతున్నారు. అయితే. ఆమె పరిస్థితి విషమించడం తో గాంధీ ఆసుపత్రి లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. గత 20 రోజులుగా జయమణి మెడికల్ లీవ్‌లో ఉందని చెబుతున్నారు చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్.. మరోవైపు.. ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో..హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నెల ముప్పై తో ఆమె గడువు ముగియనుంది.. నాలుగు రోజుల్లో పదవి విరమణ పొందాల్సిన ఆమె.. ఈలోకాలను విడిచి వెళ్లారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox