Breaking News

నీట్ పిజి నాలుగు నెలలు వాయిదా

03 rd May 2021, UTC
నీట్ పిజి నాలుగు నెలలు వాయిదా

పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించే  నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-పిజి) ను మరో నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం (పిఎంఓ) ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ నేపధ్యంలో ఫైనల్ ఇయర్ ఎంబిబిఎస్ విద్యార్థులను  తేలికపాటి కోవిడ్ -19 రోగులను పర్యవేక్షించడానికి నియమించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉంది. పరీక్షకు మూడు రోజుల ముందు, కేంద్ర ప్రభుత్వం దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షకు తాజా తేదీని తరువాత ప్రకటిస్తామని ప్రకటించింది.

100 రోజుల కోవిడ్ -19 విధినిర్వహణలో వుండే వైద్య సిబ్బందికి భవిష్యత్తులో ప్రభుత్వ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. దేశం ఎదుర్కొంటున్న కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మానవశక్తి అవసరాన్ని పెంచే ప్రయత్నంలో మెడికల్ ఇంటర్న్‌లను వారి అధ్యాపక సభ్యుల పర్యవేక్షణలో నియమించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 

జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ-అర్హత కలిగిన నర్సులు మరియు బి సి నర్సింగ్ పూర్తి చేసిన వారిని కూడా సీనియర్ వైద్యులు మరియు నర్సుల పర్యవేక్షణలో కోవిడ్-19 నర్సింగ్ విధులకు నియమించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

100 రోజుల కోవిడ్-19 విధులను పూర్తి చేసిన వైద్య సిబ్బందికి ప్రభుత్వ ప్రశంసలకు చిహ్నంగా ప్రధానమంత్రి విశిష్ట కోవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మన్‌తో ప్రదానం చేయనున్నట్లు పీఎంఒ ప్రకటించింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox