Breaking News

నాసా టాయిలెట్ పోటీ.. గెలిచినోళ్ళకి లక్షలు..!

27 th Jun 2020, UTC
నాసా టాయిలెట్ పోటీ.. గెలిచినోళ్ళకి లక్షలు..!
తాజాగా.. నాసా కంపెనీ ఓ పోటీ పెట్టింది.. అదే టాయిలెట్ల నిర్మాణం పోటీ.. చంద్రుని పై పరిశోధనల్లో నాసా మరో అడుగు ముందుకేసింది.. అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలనీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అక్కడ ఒక టాయిలెట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే.. ఈ నిర్మాణానికి రూపకల్పన చేయాలనీ ప్రపంచ వ్యాప్తం గా ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను సవాల్ చేసింది. ఇందుకోసం మంచి డిజైన్ ను తయారు చేసి ఇవ్వాల్సింది గా పిలుపునిచ్చింది. 
 
               నాసా తన ఆర్టెమిస్ మిషన్ కింద 2024 నాటికి చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించే ప్రణాళికలో  ఉంది.. ఇందుకోసమే.. చంద్రునిపై టాయిలెట్ నిర్మాణానికి పూనుకుంది. అందుకోసం ప్రపంచ వ్యాప్తం గా ఇంజినీర్లకు పోటీ పెట్టింది.. ఎవరి డిజైన్ గెలుపొందుతుందో.. వారికి రూ.26.5 లక్షల బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది.  భూమి పై లాగ.. అక్కడ గురుత్వాకర్షణ శక్తీ ఉండదు.. అంతా అంతరిక్షం లోనే తిరుగుతూ ఉంటుంది. అందుకే మరుగుదొడ్డి డిజైన్ చేయడం నాసా కు కష్టం గా తోస్తోంది.
 
                  గతం లో.. అపోలో మిషన్ సమయం లో.. వ్యోమగాములు వయోజన డైపర్లను ఉపయోగించే వారు. వాటిని సంచుల్లో భద్రపరిచేవారు..  అయితే.. 1975 లో ప్రచురించబడిన ఒక అధికారిక నివేదికలో నాసా మిషన్ గురించి ఉంది.. ఈ నివేదిక లో "మానవులతో అంతరిక్ష విమానాలు బయలు దేరినప్పుడు మలవిసర్జన, మూత్రవిసర్జన అంతరిక్షంలో ఆందోళన కలిగిస్తున్నది"" అని ఉన్నది.. ఈ నివేదిక వచ్చి ఇప్పటికే ఐదు దశాబ్దాలు కావొస్తోంది. తాజాగా ఇపుడు..చంద్ర ఉపరితలంపై వ్యోమగాముల కోసం మరుగుదొడ్డికి రూపకల్పన చేయాలని  భావిస్తోంది. ఈ ఆవిష్కరణ కోసం నాసా 35 వేల డాలర్లను బహుమతిగా అందించనున్నది. టాయిలెట్ డిజైన్లను ఆగస్టు 17 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని నాసా వెల్లడించింది.
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox