Breaking News

గృహ నిర్బంధం నుంచి జైలుకి ఆంగ్‌సాన్‌ సూకీ

23 rd Jun 2022, UTC

Myanmar: ఆంగ్‌ సాన్‌ సూకీని గృహ నిర్బంధం నుంచి జైలుకు తరలించినట్లు మయన్మార్‌ జుంటా అధికార ప్రతినిధి వెల్లడించారు. క్రిమినల్‌ చట్టాల ప్రకారం ఆంగ్‌ సాన్‌ సూకీని రాజధాని నైపిడావ్‌లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్‌ తున్‌ పేర్కొన్నారు. అయితే ఆమె తిరుగుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉంచారు.

ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హజరుపరచడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. పైగా ఆమెకు 150 ఏళ్లకు పైనే శిక్ష విధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెతో మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్‌లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంట్లోనే చాలా ఏళ్లు గృహనిర్బంధంలో ఉంది. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు, కోవిడ్‌-19 ప్రోటోకాల్‌, టెలికమ్యూనికేషన్స్‌ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్థారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox