Breaking News

కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు

04 th Oct 2021, UTC

  ఉత్తర ప్రదేశ్  లోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతుల మీదికి కారుతో దూసుకెళ్లాడన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్  లో మంత్రి కుమారుడితో పాటు ఇంకా ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, అందులో నలుగురు రైతులు ఉన్నారు.

అయితే తన కుమారుడు ఆశిష్ మిశ్రాకు ఈ హింసతో సంబంధం లేదని మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు. నా కుమారుడు ఘటన జరిగిన సమయంలో అక్కడ లేడు.  దుండగులు ఎవరో కర్రలు, కత్తులతో వారిపై దాడి చేశారు. ఉన్నారు. ఆ సమయంలో నా కొడుకు అక్కడ ఉండి ఉంటే, అతను సజీవంగా బయటకు వచ్చేవాడు కాదు," అని మిశ్రా చెప్పారు.  అసలా సమయంలో తన కుమారుడు ఘటన జరిగిన ప్రాంతంలో లేనేలేడని అన్నారు. నా కుమారుడు ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ మొత్తం సమయం నేను, నా కుమారుడు, ఉపముఖ్యమంత్రి కలిసే ఉన్నాం అని  అజయ్ మిశ్రా అన్నారు. 

ఈ సంఘటనతో ముందుజాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి అక్కడ  సిఆర్ పి సి సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించారు. భారతీయ కిసాన్ యూనియన్  నాయకుడు రాకేశ్ తికాయతత్ తన మద్దతుదారులతో కలిసి లఖింపూర్ ఖేరీచేరుకున్నారు. అక్కడి గ్రామస్తులు, రైతులతో చర్చ జరిపిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాయమని టికాయత్ చెప్పారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox