Breaking News

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

03 rd May 2021, UTC

తెలంగాణలో మున్సిపల్  ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్‌ 18వ వార్డు, పరకల 9వ వార్డు, జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో కోవిడ్‌–19 నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికారులను ఆదేశించింది. 

ఫలితాలు వెల్లడైన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఎన్నికల అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకుని నెగెటివ్‌గా తేలిన తర్వాతే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి  అనుమతించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox