Breaking News

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు కు కరోనా పాజిటివ్..!

16 th Sep 2020, UTC

టాలీవుడ్ :ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు, జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ ఆయన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు. ఇటీవల ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చిందని తేలింది. ఈ విషయమై నాగబాబు మాట్లాడుతూ వ్యాధి వచ్చిందని బాధ పడకుండా ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఇతరులకు సాయం చేయాలనీ నాగబాబు తన ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు. తగు జాగ్రత్తలు పాటించి, ఈ మహమ్మారి నుంచి కోలుకున్నాక ప్లాస్మా దానం చేస్తానని జనసేన నేత నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయమై సినీ నటుడు కల్యాణ్‌దేవ్‌ స్పందించారు. "మామయ్య మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన కామెంట్ చేసారు. దీనికి, నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆయన పోస్ట్ కు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox