Breaking News

Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం 344 మంది మృతి

15 th Aug 2021, UTC

Haiti :శనివారం హైతీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలిసింది. వందల్లో భవనాలు కుప్పకూలగా శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 304కు మృతదేహాలను సహాయక సిబ్బంది, స్థానికులు వెలికి తీశారు. రెండు వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. వెంటనే హైతీ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సహాయక చర్యల్లోకి దిగింది. ప్రకృతి విలయంపై ప్రధాని ఏరియెల్‌ హెన్రీ దిగ్‌భ్రాంతి వ్యక్తం చేశారు. నెలరోజులపాటు దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షంచాక. అంతర్జాతీయ సమాజ సాయం కోరతామని వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హైతీలో సంభవించిన భారీ భూకంప బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, ఈ విపత్తుతో తాను "బాధపడ్డానని తక్షణమే స్పందించామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox