Breaking News

నందిగ్రామ్ లో ఓడిన దీదీ

02 nd May 2021, UTC
నందిగ్రామ్ లో ఓడిన  దీదీ

దేశం మొత్తం ఎదురు చూసిన నందిగ్రామ్  పోరులో  తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పై బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సువేందు విసిరిన సవాలుతో ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు.సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. అయితే ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఆయన బీజేపీలో చేరారు. ఈ ప్రాంతంలో ఆయనకు గట్టి పట్టుంది.

దీంతో నందిగ్రామ్ నియోజకవర్గంపై దేశం మొత్తం చూపు పడింది. ఐదు అసెంబ్లీల పరిధిలోఅందరి ఆసక్తి నందిగ్రాం వైపే కనిపించింది. బీజేపీ, టీఎంసీ పార్టీలు కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటి రౌండ్ నుంచి సువేందు   మంచి  ఆధిక్యాన్ని కనపరిచారు. ఒక దశలో ఆయన మమతపై తొమ్మిదివేల ఓట్ల మెజారిటీ సాధించారు.

అయితే  9వ రౌండ్ తరువాత మమత. ఆధిక్యంలోకి వచ్చారు. సువేందు, మమత మధ్య చివరి వరకు హోరాహోరి కొనసాగింది. ఎట్టకేలకు కౌంటింగ్ ముగిసే సరికి  సువేందు మమతపై 1,622 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నందిగ్రామ్‌లో ప్రజల తీర్పును తాను అంగీకరిస్తానని మమతా బెనర్జీ చెప్పారు. అయితే  ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని టిఎంసి చీఫ్ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox