Breaking News

మహంత్ నరేంద్రగిరి కేసు సీబీఐ చేతికి

24 th Sep 2021, UTC
మహంత్ నరేంద్రగిరి కేసు సీబీఐ చేతికి

అఖిల భారతీయ అఖర పరిషత్ చీఫ్ మహంత్ నరేంద్ర గిరి మరణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.మహంత్ నరేంద్ర గిరి సోమవారం బాఘంబరి గడ్డి మఠంలోని తన గదిలో శవమై కనిపించాడు. ఉరి కారణంగా నరేంద్ర గిరి ఊపిరాడక మరణించినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు  వెల్లడించింది.

నరేంద్ర గిరి మరణంపై సిబిఐ విచారణకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు తో  సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.యూపీ  పోలీసుల దర్యాప్తు ప్రకారం, 72 ఏళ్ల అతను చివరిగా సోమవారం భోజనం తర్వాత తన గదిలోకి ప్రవేశించాడు. సాయంత్రం, అతని శిష్యులు తలుపు తట్టినప్పుడు, దానికి సమాధానం రాలేదు.అతని సెల్‌ కు పదేపదే  ఫోన్ చేసినప్పటికీ  జవాబు రాలేదు, అతని శిష్యులు తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించారు. లోపల  నరేంద్ర గిరి పైకప్పుకు వేలాడుతూ కనిపించారు.

మహంత్ నరేంద్ర గిరి తనను ఇబ్బంది పెడుతున్న పలువ్యక్తుల పేర్లతో కూడిన సూసైడ్ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు.నేను గౌరవంగా జీవించాను, అవమానంతో జీవించలేను, అందుకే నేను నా ప్రాణం తీసుకుంటున్నట్లు లెటర్ లో వుందని పోలీసులు తెలిపారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox