Breaking News

హీరో సూర్యకు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురు

18 th Aug 2021, UTC

దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ నటుడు సూర్య చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. 2007-08 మరియు 2008-09 సంవత్సరాలకు గాను 3 కోట్ల 11 లక్షల 96 వేల రూపాయలు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని 2011 లో నటుడు సూర్యకు ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

 ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహాయించాలని కోరుతూ సూర్య  మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని చెబుతూ..ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

ఆదాయపు పన్ను నిర్ణయానికి వ్యతిరేకంగా కొనసాగిన కేసులో, ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ కేసుపై మూడేళ్ల తర్వాత అప్పీల్ చేయాలని నిర్ణయించుకుంటే సూర్యకు మినహాయింపు ఇవ్వాలని సూర్య  తరపున లాయర్ విజ్ఞప్తి చేసారు. అయితే  ఆదాయపు పన్ను మదింపు ప్రక్రియకు సూర్య పూర్తిగా సహకరించనందున అతనికి వడ్డీ తగ్గింపుకు అర్హత లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox