Breaking News

లఖింపూర్ ఖేరీ హింస.. ప్రియాంకగాంధీ, అఖిలేష్ యాదవ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు

04 th Oct 2021, UTC

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని  ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో అరెస్టు చేసారు, ఆదివారం లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనలో  ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించడానికిలక్నోలో  బయలుదేరిన ప్రియాంక గాంధీ కాన్వాయ్  పోలీసులు నిలిపివేసారు. అయితే ప్రియాంక  కాంగ్రెస్ నాయకుడు దీపేంద్ర సింగ్ హుడాతో కలిసి లఖింపూర్ ఖేరీకి బయలుదేరింది.సోమవారం ఉదయం 6 గంటలకు ప్రియాంక సీతాపూర్ జిల్లాలోని హర్‌గావ్ చేరుకున్న వెంటనే, ఆమెను ఆపివేశారు. మహిళా కానిస్టేబుల్‌తో స్వల్ప ఘర్షణ జరిగిన తరువాత, ప్రియాంక తన అరెస్ట్ వారెంట్‌ను చూడాలని డిమాండ్ చేసింది. పోలీసు సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

లక్నోలోని తన నివాసం వెలుపల లఖింపూర్ ఖేరీ హింసకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.లఖింపూర్ ఘటనలో మంత్రిని మరియు అతని కుమారుడిని అరెస్టు చేయాలని అఖిలేష్ యాదవ్  డిమాండ్ చేసారు.ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు శివపాల్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

లఖింపూర్ ఖేరిలో నిరసన చేస్తున్న రైతుల గుంపుపై కేంద్ర మంత్రి కుమారుడి కారు దూసుకు వెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింస మరో నలుగురి ప్రాణాలను బలిగొంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox