Breaking News

బీజేపీ పై కేసీఆర్, కేటీఆర్ ల విషప్రచారం.. కిషన్ రెడ్డి

13 th May 2022, UTC

Hyderabad: బీజేపీ పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పొద్దున లేచిన దగ్గర నుంచి చెప్పిందే చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. 

వాళ్ల పరిపాలనలో తెలంగాణ బాగా అభివృద్ధి చేశాం, దేశమే అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో తాము రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox