Breaking News

'కెజిఎఫ్' హవాకు బ్రేకులు.. యష్ కు నోటీసులు..!

13 th Jan 2021, UTC

కెజిఎఫ్ సినిమాకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయినా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అయినా సంగతి  తెలిసిందే.విడుదల అయ్యిన 24 గంటల్లో ఈ చిత్ర టీజర్ 140 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే, ఈ టీజర్ పై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తింది. 

'కెజిఎఫ్' టీజర్ లో పొగ తాగే సీన్ ఎంత హై లైట్ అయిందో చెప్పక్కర్లేదు. కానీ ఈ సీన్ టొబాకో 2003 చట్టంలోని నిబంధనలను అతిక్రమించాయంటూ కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సీన్లను చూసి యువత ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ టీజర్ లో ఉన్న పొగ తాగే సీన్లను, పోస్టర్లను వెంటనే తీసి వేయాలని యాంటీ టొబాకో సెల్ చిత్ర యూనిట్ కి ఆర్డర్ ఇచ్చింది.

హీరో యష్ కు ఎంత ఫాలోయింగ్ ఉందొ తెలిసిందే. వారిలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. హీరోని అనుకరించే క్రమంలో వీరు కూడా ఇలాంటి సాహసాలకు దిగేందుకు ప్రేరేపించే బడే అవకాశం ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్, కర్ణాటక ఫిలిం ఛాంబర్, నిర్మాత విజయ్ కిర్గాంధర్ కు ఆరోగ్య శాఖ నోటీసులు పంపింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox