Breaking News

బీజేపీకి ప్రచారం చేయనున్న జనసేన..గ్రేటర్ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లే..!

20 th Nov 2020, UTC

గ్రేటర్ ఎన్నికలలో తాము కూడా పాల్గొంటామని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో బీజేపీతో పొత్తు ఉంటుందంటూ జనసేన ప్రకటించింది. మరో వైపు అలాంటిదేమీ లేదని, పొత్తు విషయమై తమనెవరూ సంప్రదించలేదని బీజేపీ స్పష్టం చేసింది. దీనితో, జనసేన, బీజేపీ పొత్తు విషయమై సందిగ్ధత నెలకొంది. మరో వైపు స్వతంత్రంగానే పోటీ చేస్తూ, అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన ప్రకటన విడుదల చేసినప్పటికీ, ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు.
 
ఈలోపు, గ్రేటర్ ఎన్నికల నామినేషన్ గడువు కూడా ముగిసింది. సమయం తక్కువగా ఉండడంతో జనసేన ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. ఓ వైపు నామినేషన్ గడువు ముగుస్తున్న సమయంలో, బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను, నాదెండ్ల మనోహర్ ను కలిశారు. నాదెండ్ల మనోహర్ నివాసం లో వీరు ఇరువురు చర్చలు జరుపుకున్నారు.  ఓ పక్క నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో వీరు చర్చించుకోవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డిలు ఈ సమావేశంలో పాలు పంచుకున్నారు.

గ్రేటర్ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేయాల్సిందిగా బీజేపీ నేతలు ఈ సమావేశంలో జనసేనానిని కోరారు. కాగా అందుకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. చర్చ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలి అని కోరారు. సమయం లేకపోవడం, కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్ల  బీజేపీ, జనసేనలకు పొత్తు కుదరలేదు అని పవన్ వివరించారు. ఏపీ, తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. హైదరాబాద్ లో బలమైన నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox