సోమవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మిర్ లో మరోసారి కాల్పులు జరిగాయి. భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో సరిహద్దుల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ముగ్గురు జవానులు కూడా గాయపడ్డారు. అయితే.. ఈ ఎన్కౌంటర్ నేపధ్యం లో ఆర్మీ మరింత అలెర్ట్ అయింది.. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారేమో అని గాలింపు చర్యలు చేపట్టింది.
పింజోరా ప్రాంతం లోకి కొందరు ఉగ్రవాదులు వచ్చినట్లు సమాచారం అందడం తో.. ఉగ్రవాదులు గాలింపు చర్యలు చేపట్టారు... కొందరు ఉగ్రవాదులు దొరకడం తో.. వారిపై కాల్పులకు దిగారు.. సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. గత కొంత కాలం గా ఉగ్రవాదులు భారత్ లో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దులు దాటి దొంగచాటుగా భూభాగం లోకి వస్తున్నారు. ఇలా వచ్చేవారిని ఓ వైపు సైన్యం మట్టుబెడుతూనే ఉంది... మరోవైపు. వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. సోమవారం జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.