Breaking News

హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ఇబ్బందులు వుండవు.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

24 th Dec 2021, UTC

సినిమా యాక్టర్ నాని వ్యాఖ్యలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు . మాకు ఏ నానీలు తెలియదు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒకడేనని కౌంటరిచ్చారు. సినిమా లో జరిగే దోపిడీ ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70 శాతం ఉంటుందన్నారు.

సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా అని సూచించిన అనిల్…ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించారు. కేవలం నలుగురు వ్యక్తుల జేబుల్లోకి కోట్లాది రూపాయలు  వెడుతున్నాయని దీనికి ప్రొడక్షన్ కాస్ట్ అని అనడం సరికాదన్నారు.  పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ రూ.50 కోట్లు అని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారని ఆయన రూ10 కోట్లు తీసుకుంటే టిక్కెట్ల ధరలపై అందోళన చేయనవసరం లేదన్నారు.

తాను ఒకప్పడు బైకులు తనఖా పెట్టి పవన్ కళ్యాణ్ సిమాలకు కటౌట్లు పెట్టానని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. యువత ఇప్పటికైనా బాధ్యతగా ఆలోచించాలని తల్లిదండ్రుల కష్టాన్ని  వృధా చేయవద్దని హితవు పలికారు. చారిత్రాత్మక సినిమాలు, సందేశాత్మక చిత్రాలకు  ధరలు పెంచమని కోరితే కొంతవరకూ సబబుగా వుంటుందని అనిల్ అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox