Breaking News

ఏపీలో పరిషత్ ఎన్నికలకు సుప్రీం బ్రేకులు

06 th Apr 2021, UTC
ఏపీలో పరిషత్ ఎన్నికలకు సుప్రీం బ్రేకులు

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. 

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికాలం పూర్తి కావడంతో ఏపీ నూతన ఎస్ఈసీ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కొనసాగాలని ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి.

తమ ఫిర్యాదులను సైతం పరిశీలించకుండా, బలవంతపు ఏకగ్రీవాలు చేపిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దిక్కరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. టీడీపీ ఏకంగా పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox